SAROCHARU Movie Review In Telugu

రవితేజ ఈ సంవత్సరంలో ఇప్పటికే మూడు సినిమాలు ఇచ్చి నాలుగో సినిమా ‘సారొచ్చారు’ అంటూ రెడీ అయ్యాడు. రవితేజ, పరుశురాం ‘ఆంజనేయులు’ కాంబినేషన్ రిపీట్ చేస్తూ మళ్లీ సారొచ్చారు అంటూ వచ్చారు. రవితేజ సారుకి జోడీగా కాజల్ అగర్వాల్, రిచా గంగోపాధ్యాయ నటించారు. వైజయంతి బ్యానర్లో అశ్విని దత్ సమర్పించిన సారొచ్చారు సినిమాని ప్రియాంక దత్ నిర్మించారు. సారు ఎందుకు వచ్చారు? ఎవరి కోసం వచ్చారో ఒకసారి చూద్దాం.


కథ :
కార్తీక్ (రవితేజ) ఇటలీలో జాబ్ చేస్తుంటాడు. ఫ్రెండ్స్ ఎవ్వరు ప్రేమించుకున్నా అందరినీ ఎదిరించి పెళ్లి చేస్తుంటాడు. ఇలా ఒక జంటని కలపడం చూసిన సంధ్య (కాజల్) కార్తీక్ ని ప్రేమించడం మొదలు పెడుతుంది. కార్తీక్ మొదట్లో సంధ్యని అవాయిడ్ చేస్తుంటాడు. అయినా పట్టువిడవకుండా సంధ్య ప్రేమిస్తూనే ఉంటుంది. సంధ్య భాధ భరించలేని కార్తీక్ తనకి ఇప్పటికే పెళ్లయింది అని చెప్తాడు. సంధ్యకి తన గతం చెప్పడం మొదలుపెడతాడు. కార్తీక్ ఫుట్ బాల్ కోచ్ గా పనిచేస్తున్న సమయంలో వసు (రిచా) అనే అమ్మాయిని ప్రేమించి పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత ఏమైంది? సంధ్యని పెళ్లి చేసుకోవాలనుకున్న సంధ్య బావ గౌతమ్ (నారా రోహిత్) ఏమయ్యాడు? ఈ ప్రశ్నలకి సమాధానం కావాలంటే సారొచ్చారు సినిమా చూడాలి

Comments